calender_icon.png 25 November, 2024 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని పట్టణానికి మహర్దశ

08-10-2024 12:00:00 AM

అభివృద్ధికి రూ.500 కోట్లు విడుదల

మారనున్న రూపురేఖలు 

మంథని, అక్టోబర్ 7 (విజయక్రాంతి): మంథని పట్టణానికి మహర్దశ పట్టనుంది. మం థని అభివృద్ధికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆదేశాలతో దాదాపు రూ.500 కోట్ల నిధులకు ప్రతి పాదనలు పంపించగా అవి మంజూరు అయ్యాయని ఆర్‌అండ్‌బీ అధికారులు సోమవారం తెలి పారు.

వీటిలో మంథని నుంచి గోదావరిఖని రోడ్డు వరకు బైపాస్ రోడ్డు కోసం రూ.80 కోట్లు, గోదావరి నదిపై వంతెనకు రూ.125 కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రూ.300 కోట్లు కేటాయిం చనున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్‌తో పాటు అర్‌అండ్‌బీ, ఇతర అధికారులు సర్వే చేయనున్నారు. దీంతో మంథని పట్టణ రూపురేఖలు మారనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి శ్రీధర్‌బాబు మంథని అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాడని చెప్పేం దుకు ఈ నిధులే నిదర్శమని కిసాన్ సెల్ జిల్లా చైర్మన్ ముస్కుల సురేందర్‌రెడ్డి అన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు సీఎం రేవంత్‌రెడ్డి సహకరంతో మంథని నియోజవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయనున్నారని ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

ఇప్ప టికే మంథని పట్టణానికి రూ.32 కోట్లు నిధులు మంజూరు చేయించడంతో అభివృద్ధి పనులు జ రుగుతున్నాయి. మంథనిలో కూరగాయల మార్కెట్‌తో పాటు నూతన మున్సిపల్ భవనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు నిర్మించనున్నారు.