calender_icon.png 25 September, 2024 | 5:54 AM

పర్యాటకానికి మహర్దశ!

25-09-2024 04:00:35 AM

  1. మూడు టూరిజం క్లస్టర్ల అభివృద్ధికి ప్రణాళికలు
  2. కేంద్ర మూలధన సహాయ పథకం కింద సాయం
  3. ప్రైవేట్ ఏజెన్సీలకు డీపీఆర్ బాధ్యత అప్పగింత
  4. దసరాలోగా కేంద్రానికి పర్యాటక శాఖ ప్రతిపాదనలు! 

హైదరాబాద్, సెప్టెంబర్ 2౪ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అందించే మూల ధన సహాయ పథకం కింద రాష్ట్రంలోని టూరిజం కేంద్రాలను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకోసం మూడు టూరిజం క్లస్టర్లను ఎంపిక చేసినట్టు తెలిసింది.

కేంద్ర నిధులతో రామప్ప, నల్లమల, నాగార్జునసాగర్ క్లస్టర్లను అభివృద్ధి చేయాలని నిర్ణయిం చినట్టు విశ్వసనీయ సమాచారం. మూలధన సహాయ పథకం కింద కేంద్రం అందించే నిధులను పొందాలంటే.. పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం డిటెయిల్డ్ ప్రాజె క్టు రిపోర్టు (డీపీఆర్) అందించాల్సి ఉం టుం ది.

ఈ క్రమంలో ప్రతిపాదలను రూపొందిం చే బాధ్యతలను తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించింది. టెండర్ ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలను కార్పొరేషన్ ఎంపిక చేసింది. ప్రస్తు తం ఆ ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకుంటున్న క్లస్టర్లపై ప్రతిపా దలను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

రూ.300 కోట్ల వరకు ప్రతిపాదనలు

మూలధన సహాయ పథకం కింద మూ డు ప్రాజెక్టుల డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమ వుతోంది. ఒక్కో ప్రాజెక్టుకు రూ.100 కోట్ల సాయాన్ని కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా రూ.300 కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

అయితే, ఈ స్కీమ్ కింద ఒక రాష్ట్రానికి రూ.250 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వొద్దని మార్గదర్శకాలు చెప్తున్నాయి. మరి కేంద్రం అదనపు సాయం అందజేస్తుందా? లేక నిబంధనల ప్రకారమే నిధులను విడుదల చేస్తుందా? అనేది తెలియాల్సి ఉంది.

దసరాలోపు కేంద్రానికి నివేదిక

రామప్ప, నల్లమల, నాగార్జన సాగర్ క్లస్టర్ల అభివృద్ధికి సంబంధించిన డీపీఆర్‌పై ఏజెన్సీలు కసరత్తు ముమ్మరం చేశాయి. త్వరలోనే ప్రభుత్వానికి డీపీఆర్‌ను అందజేసే అవకాశం ఉన్నట్టు పర్యాటక శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను దసరాలోపే కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించాయి.

డీపీఆర్ అందిన వెంటనే పరిశీలించి అందుకు అనుగుణంగా కేంద్రం నిధులను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం చేస్తుందా? లేక తగ్గించి ఇస్తుందా? తెలియాల్సి ఉంది. 

50 ఏళ్ల పాటు వడ్డీలు లేని రుణాలు 

పలు విభాగాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు కేంద్రం క్యాపిటల్ అసిస్టెన్స్ స్కీమ్ కింద వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దీని కింద తీసుకున్న రుణాలకు 50 ఏళ్ల వరకు వడ్డీ ఉండదు. తాజాగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు మూలధన సహాయ పథకం కింద నిధులను అందించేందుకు కేం ద్ర ఆర్థిక శాఖ డీపీఆర్‌లను కోరింది.

ప్రపంచస్థాయిలో పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు ఉండాల ని కేంద్రం సూచించింది. అలాగే, రాష్ట్రాలు ప్రతిపాదించే టూరిజం ప్రాజెక్టులు 2026 మార్చి 31 నాటికి పూర్తయ్యేలా ఉండాలని నిబంధన విధించింది. కేంద్రం సూచనలకు అనుగూనంగా పర్యాటక ప్రాంతాల ను ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసే ప్రణాళికలతో రాష్ట్ర పర్యాటక శాఖ డీపీఆర్‌ను సిద్ధం చేస్తోంది.