calender_icon.png 17 October, 2024 | 3:56 AM

గ్రామీణ రహదారులకు మహర్దశ

17-10-2024 02:16:29 AM

కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు రూ.40 కోట్లు 

కోదాడ, అక్టోబర్ 16: సూర్యాపేట జిల్లా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని గ్రామీణ అంతర్గత రహదారుల అభివృద్ధికి నిధు లు మంజూరయ్యాయి. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి దంపతులు ప్రజలు, నాయ కుల నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ప్రత్యేక చొరవ చూపి నిధు లు మంజూరు చేయించారు. కోదా డ నియోజకవర్గానికి రూ.15 కోట్లు మంజూరయ్యాయి. హుజుర్‌నగర్ నియోజకవర్గానికి రూ.25 కోట్లు మంజూరయ్యాయి. 

కోరుట్లలో వంతెనల నిర్మాణానికి రూ.14.30 కోట్లు

కరీంనగర్, అక్టోబరు 16 (విజయక్రాంతి): కోరుట్ల నియోజకవర్గంలోని పలు మార్గాల్లో వంతెనల నిర్మాణం కోసం రూ.14.30 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని నియోజకవర్గ కాంగ్రెస్ పారీట ఇన్‌చార్జి జువ్వాడి నరసింగరావు, పారీట రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు బుధవారం తెలిపారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కకు వారు కృత జ్ఞతలు తెలిపారు.