calender_icon.png 15 October, 2024 | 7:42 AM

గ్రామీణ రోడ్లకు మాహర్దశ

15-10-2024 03:29:35 AM

1377 కోట్ల నిధుల మంజూరు

92 నియోజకవర్గాల్లో రూ.1323 కిలోమీటర్ల మేర నిర్మాణం

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి సీతక్క 

హైదరాబాద్, అక్టోబర్ 14 (విజయ క్రాంతి) : తెలంగాణలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ పట్టనున్నది. ఇప్పటికే రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆయా గ్రామాల పరిధిలో 1323.86 కిలోమీటర్ల మేర నూతనంగా రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటిం చింది. నిర్మాణ పనులకుగాను రూ. 1,377.66 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ఖజానా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు కేటాయించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.

అవసరాన్ని, అవకాశాన్ని బట్టి మరిన్ని నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. సీఆర్‌ఆర్ రోడ్ల కోసం మరో రెండు మూడు రోజుల్లో రూ.400 కోట్ల మేర నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు.