calender_icon.png 26 October, 2024 | 10:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ, హుజూర్‌నగర్ రోడ్లకు మహర్దశ

05-08-2024 01:56:36 AM

  1. రూ.232.90 కోట్ల నిధులు విడుదల 
  2. హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణాలకు సైతం..

సూర్యాపేట, ఆగస్టు 4: జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లోని ఆర్ అండ్‌బీ రహదారులకు మహర్దశ రా నుంది. రహదారుల విస్తరణతో పాటు హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రూ.232.90 కోట్ల నిధులను మంజూరు చేయించారు. మంత్రి, ఎమ్మెల్యే నేడు, రేపు కోదాడ, హుజూర్‌నగర్ పట్టణాల్లో ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షలు నిర్వహించి పనులను ప్రారంభించనున్నారు.

కోదాడ నియోజకవర్గంలో.. 

కోదాడ నియోజకవర్గంలోని రహదారులను రూ.82 కోట్లతో విస్తరింపజేయనున్నా రు. కోదాడ పట్టణంలో తొమ్మిదో నెంబర్ జాతీయ రహదారి విస్తరణకు రూ.18 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రెడ్లకుంట వరకు 8.4 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ.20 కోట్లు, ఆకుపాముల నుంచి రత్నవరం వర కు రూ.16 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కూచిపూడి వరకు 5.2 కిలోమీటర్ల మేర రూ.12 కోట్లు, చిలుకూరు నుంచి జెర్రిపోతులగూడెం రోడ్డులో మూడు కిలోమీటర్‌లకు రూ.8 కోట్లు, తొగర్రాయి నుంచి శీతల్‌తండా 4 కిలోమీటర్‌ల మేర రోడ్డు అభివృద్ధికి రూ.8 కోట్లు కేటాయించారు. 

హుజూర్‌నగర్‌లో..

నియోజకవర్గంలో రహదారుల విస్తరణ, అభివృద్ధికి రూ.150.90 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్  సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి కిష్టాపురం ఎక్స్ రోడ్డు వరకు 10.5 కి.మీ.కు రూ.15 కోట్లు, మేళ్లచెరువు నుంచి చౌటపల్లి వరకు 7.1 కి.మీ.లకు రూ.10 కోట్లు, తెలంగాణ రాష్ట్రాలను కలిపే హుజూర్‌నగర్ నుంచి మట్టపల్లి రోడ్డు 25 కి.మీ.ల మేర విస్తరణకు రూ.80 కోట్లు, మేళ్లచెరువు విస్తరణకు రూ.10 కోట్లు, కీతవారి గూడెం రోడ్డులో హైలెవల్ బ్రిడ్జి పునర్నిర్మాణానికి రూ.6.90 కోట్లు, అమరవరం రోడ్డులో హైలెవల్ బ్రిడ్జి పునర్నిర్మానానికి రూ.11.50 కోట్లు, మఠంపల్లి నుంచి జాన్‌పహాడ్ రోడ్డులో హైలెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి రూ.17.50 కోట్లు కేటాయించారు.