- ఎన్నికల ఫలితాలతో అక్కడి ప్రజలు ఆవేదన చెందారు
- అధికారం, ప్రతిపక్షం అశాశ్వతం
- ప్రజల తీర్పే శిరోధార్యం
- కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ అన తి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యుత్తు, సాగు, తాగునీరు, వ్యవసాయ రంగాల్లో బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యాచరణ దేశ చరిత్రలోనే లేని విధంగా కొనసాగిందన్నారు. గురువారం ఎర్రవల్లి నివాసంలో ఖమ్మం, మహబూబాబాద్, నర్సాపూర్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయ ప్రగతిని చూసి మహారాష్ట్ర వంటి పక్క రాష్ట్రాల ప్రజలు తమకూ కేసీఆర్ పాల న కావాలని కోరుకున్నారని తెలిపారు.
ఆబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో దేశం లో రైతురాజ్యం తెచ్చుకోవాలని బీఆర్ఎస్తో కలిసి అడుగులేస్తూ ముందుకు కదిలిన మహారాష్ట్ర తదితర రాష్ట్రాల ప్రజలు మొన్న టి తెలంగాణ ఎన్నికల ఫలితాలతో తీవ్ర ఆవేదన చెందారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలన లేకపోవడంతో తెలంగాణ రైతుల కంటే మహారాష్ట్రతో పాటు దేశ రైతాంగమే తీవ్రం గా నష్టపోయిందని ఇటీవల తనను కలిసిన మహారాష్ట్ర నేతలు చెప్పారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో రైతు రాజ్యాన్ని అందించగల దమ్మున్న కేసీఆర్ దార్శనిక నాయకత్వాన్ని దేశం కోల్పోయిందని వారు బాధపడ్డారని తెలిపారు.
నల్లచట్టాలను తెచ్చి తమ జీవితాలను, తాము నమ్ముకున్న వ్యవసాయం రంగం ఆగం చేయాలని చూసిన గత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీ వీధుల్లో దేశ రైతాంగం శాంతి యుత పోరాటం చేసిన సంగతి గుర్తు చేశా రు. రైతుల మీద లాఠీ చార్జీ కాల్పులు జరిపి ఏడువందల మంది రైతుల మరణానికి నాటి బీజేపీ సర్కార్ కారణమైందన్నారు. దేశ రైతాంగ బాధలను తీర్చేందుకు నడుం కట్టిన బీఆర్ఎస్ కిసాన్ సర్కార్ నినాదంతో మహారాష్ట్ర నుండి ఒకలైన్ తీసుకొని ముం దుకు సాగిందన్నారు. ఈక్రమంలో మహారాష్ట్ర ప్రజల అపూర్వ స్పందన కనిపిం చిందన్నారు. తెలంగాణతో పాటు దేశ రైతాంగం ప్రగతి కోసం బయలుదేరిన నేపథ్యంలో తెలంగాణ ప్రజల నిర్ణయం ఇతర రాష్ట్రాల రైతాంగాన్ని నిరుత్సాహపరించింద ని వెల్లడించారు. అయినా ఏమాత్రం అధైర్యపడొద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.
ప్రజల తీర్పే అంతిమం
ప్రజాస్వామ్యంలో ప్రజలదే అంతిమ నిర్ణయమని, అధికారం శాశ్వతం కాదని, ప్రతి పక్ష పాత్ర కూడా శాశ్వతం కాదని, మనకు ప్రజా తీర్పే శిరోధార్యం వారు ఎటువంటి పాత్రను అప్పగిస్తే దానిని చిత్తశుద్దితో నిర్వహించాలని సూచించారు. అధికారం కోల్పోయామని బాధపడటం సరైన రాజకీయ నాయకుని లక్షణం కాదన్నారు. ప్రజా సంక్షేమం కోసం సాగే నిరంతర ప్రక్రియనే రాజకీయమని, దానికి గెలుపు ఓటములతో సంబంధం ఉండదన్నారు.
ప్రజల్లో కలిసి ఉంటూ వారి సమస్యల మీద నిరంతరం పోరాడుతూ వారి అభిమానం సాధించాలని పునరుద్ఘటించారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం కొనసాగించిన సాగునీరు, తాగునీరు నిరంతరం విద్యుత్, ఫీజు రియంబర్స్మెం ట్ , సీఎంఆర్ఎఫ్ వంటి అనేక పథకాలను కూడా కాంగ్రెస్ కొనసాగించకపోవడంతో తెలంగాణ సమా జం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తెలంగాణ సంపూర్ణ అభివృద్ది సాధిం చడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని స్ప ష్టం చేశారు. గెలుపోటములకు అతీతంగా నిరంతర కృషి కొన సాగించడమే మన కర్తవ్యమని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.
మన ప్రభుత్వం పొగొట్టుకున్నాం : కార్యకర్తలు
అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని తెలంగాణను సకలం బాగుచేసిన కేసీఆర్ పాలన పోతదనుకోలేదని, జరిగిన పొరపాటుకు తెలంగాణ సమాజం బాధపడుతున్నట్లు కేసీఆర్ కలవడానికి పలు ప్రాంతాల నుండి వచ్చి కార్యకర్తలు, అభిమానులు అభిప్రాయపడ్డారు. తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని జై సీఎం, జై కేసీఆర్ నినాదాలతో తమ మద్దతు ప్రకటించారు. ప్రతిరోజు మాదిరిగా గురువారం తమ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి నివాసానికి కార్యకర్తలు, అబిమానలు తరలివచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, వేములవాడ, నర్సాపూర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.