calender_icon.png 20 November, 2024 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర ఎన్నికలు: ఉదయం 11 వరకు 18 శాతం ఓటింగ్

20-11-2024 12:13:40 PM

ముంబై: మహారాష్ట్రలో బుధవారం నాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు మహారాష్ట్రలో 18.14 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే జార్ఖండ్ రెండో దశ ఎన్నికలలో 31.37% పోలింగ్ నమోదైంది. నటుడు సునీల్ శెట్టి ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు వేయడం మన హక్కుతో పాటు కర్తవ్యం.. ఓటేయండి...మహారాష్ట్ర అభివృద్ధితో పాటు ఇక్కడి పిల్లల సంక్షేమం కోసం పాటుపడే వారికే ముంబైలోని ఓటేస్తానని  సినీ దర్శకుడు సుభాష్ ఘాయ్ తన సిరా వేలును చూపించాడు. నటుడు, శివసేన నాయకుడు గోవిందా భార్య సునీతా అహుజా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు 2024 కోసం ముంబైలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.  ఎన్సీపీ నేత సునేత్రా పవార్ పూణెలోని కటేవాడి పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. "ఓటింగ్‌ను వినియోగించుకునే అవకాశం లభించడం ఒక అమూల్యమైన భాగ్యం, మాకు ఈ ప్రత్యేక హక్కు లభించినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ ఎంపికను వినియోగించుకుని ఓటు వేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను" అని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. ముంబైలోని పెద్దార్ రోడ్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.