calender_icon.png 23 November, 2024 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలు

23-11-2024 02:40:54 AM

ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం

కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన ఈసీ

న్యూఢిల్లీ, నవంబర్ 22: దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం(నేడు) వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ఇరు రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మహారాష్ట్రలో ఓట్లను లెక్కించడానికి 288 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. అలాగే జార్ఖండ్‌లో 24 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు.

రెండు రాష్ట్రాల్లో ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కించనున్నారు. నవంబర్ 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్నందున ఎన్నికల గెలిచిన పార్టీ 72 గంటల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 

మూడంచెల భద్రత

కౌటింగ్ సజావుగా సాగేందుకు కౌంటి ంగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పా టు చేసినట్టు అధికారులు తెలిపారు. కేంద్ర బలగాలు, రాష్ట్ర రిజర్వ్ బలగాలతోపాటు రాష్ట్ర పోలీసులను మోహరించినట్టు పేర్కొన్నారు. ఈవీఎంలపై సీసీటీవీ నిఘా ఉంచిన ట్లు చెప్పారు. ఫుటేజీని అభ్యర్థులకు అందుబాటులో ఉంచామని, పరిశీలకుల ముందే స్ట్రాంగ్‌రూమ్‌లను తెరుస్తామన్నారు. 

కాంగ్రెస్ కీలక చర్యలు

మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఎన్నికల తర్వాతి పరిస్థితులను పర్యవేక్షణకు ప్రత్యేకంగా పరిశీలకులను నియమించింది. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, అశోక్ గెహ్లాత్, భూపేశ్ బఘేల్, డాక్టర్ పరమేశ్వర్లను మహారాష్ట్ర పరిశీలకులుగా నియమించగా తారిఖ్ అన్వ ర్, భట్టి విక్రమార్క, కృష్ణ అల్లవూరును జార్ఖ ండ్‌కు పరిశీలకులుగా పంపింది.