ముంబై: మహారాష్ట్రలో మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది. దీంతో మహాయుతి కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. 'మహా'లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే కసరత్తు మొదలు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో బీజేపీ కూటమి 218, కాంగ్రెస్ కూటమి 58, ఇతరులు 13 స్థానాల్లో ఆధిక్యం ఉన్నారు.
ఈ సందర్భంగా మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే మాట్లాడుతూ... ఇది భారీ విజయం, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాలకు ధన్యవాదాలు. మహాయుతిని ఆశీర్వదించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహాయుతి అఖండ విజయం వస్తుందని ముందే చెప్పానన్నారు. పూర్తి ఫలితాలు వచ్చాక సీఎం పదవిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎం పదవిపై మహాయుతి కూటమి చర్చించి నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.