calender_icon.png 23 November, 2024 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రలో అధికారం దిశగా మహాయుతి కూటమి

23-11-2024 12:13:26 PM

ముంబై: మహారాష్ట్ర ఉత్సాహంతో ఓటు వేసింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఓటింగ్ శాతాన్ని నమోదు చేసింది. నెలల తరబడి ప్రచారం సాగిన తర్వాత, ఎట్టకేలకు ఆ క్షణం రానే వచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో మహాయతి ఖాతా తెరిచింది. వడాలలో 59,764 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కాళిదాస్ నీలకంఠ్ విజయం సాధించారు. 2024 మహారాష్ట్రలో అధికారం నిలబెట్టుకునే దిశగా మహాయుతి కూటిమి దూసుకెళ్తోంది. మహాయుతి కూటమి అభ్యర్థులు ఆధిక్యాల్లో కొనసాగుతున్నారు. మూటింట రెండొంతుల స్థానాల్లో మహాయుతి అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను బట్టి బీజేపీ నేతలు ఫడణవీస్ సీఎం అవుతారని చెబుతున్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 222 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎంవీఏ 55 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  ప్రత్యర్థి పొత్తులు మహాయుతి (బిజెపి-శివసేన-ఎన్‌సిపి), మహా వికాస్ అఘాడి (ఎన్‌సిపి (ఎస్‌పి)-శివసేన (యుబిటి)-కాంగ్రెస్) ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఆశాజనకంగా ఉన్నాయి. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి 215 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా మూడు స్థానాల్లో విజయం సాధించింంది. అటు ఎంవీఏ 58 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇతరులు 12 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.