calender_icon.png 24 November, 2024 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర సీఎం ఎవరు..? రేసులో ఆ ఇద్దరు..!

24-11-2024 11:40:14 AM

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోని 288 సీట్లలో 230 సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠానం-ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే లేదా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌లో ఎవరు అధిష్టించాలనే దానిపై తీవ్ర పోటీకి నేడో, రేపో క్లారిటీ వచ్చే అవకాశముంది. దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి కావాలని మహారాష్ట్ర బీజేపీ నేతలు పట్టబట్టారు. దీనిపై స్పందించిన ఏక్ నాథ్ సిండే ఎక్కువ సీట్లు వస్తే సీఎం పదవి ఇవ్వాలన్న రూల్ లేదని చెబుతున్నారు. మరోపక్క సీఎం కుర్చీపై అజిత్ పవార్ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర సీఎం ఎవరనేది మూడు పార్టీలు చర్చించి నిర్ణయిస్తామని షిండే, ఫడ్నవీస్ తెలిపారు. పోటీ తీవ్రతరం అయితే సీఎం సీటులో కొత్త వ్యక్తిని తెరపైకి తేచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అటు ఎల్లుండితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియనుంది. చంద్రకాంత్ పాటిల్ సహా బీజేపీ సీనియర్ నేతలు ఫడ్నవీస్‌కు బహిరంగంగా మద్దతు పలికారు. ''సీఎం ఎవరనేది మన కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయిస్తుంది. అయినా అడిగితే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కావాలని ఏకగ్రీవంగా చెబుతాం’’ అని అన్నారు. మహాయుతి కూటమిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), శివసేన (షిండే వర్గం) అజిత్ పవార్  నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లతో కూడిన కూటమి, ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి (ఎంవిఎ)ఉన్నాయి. మహాయుతి కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏకంగా 132 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. శివసేన (57), అజిత్ పవార్ ఎన్సీపీ వర్గం (41) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

అటు జేఎంఎం నేతృత్వంలోని కూటమి జార్ఖండ్‌లో అద్భుతమైన విజయాన్ని సాధించడం ద్వారా చరిత్ర సృష్టించింది. మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశ, జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అటు వయనాడ్ ఉపఎన్నికల విజయం తర్వాత, ప్రియాంక గాంధీ రికార్డు విజయం సాధించారు.