calender_icon.png 18 November, 2024 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ప్రచారంలో తెలంగాణ మంత్రులు

18-11-2024 03:49:31 PM

రాజురా,(విజయక్రాంతి): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని మరింత ఉధృతం చేశాయి. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు స్థానిక పార్టీ యూనిట్లను ప్రభావితం చేసేందుకు సీనియర్ నేతలను రంగంలోకి దించాయి. తాజాగా మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా రాజురా ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చెప్పినట్లుగా ఈ దేశంలో ఎవరు అడ్డుపడినా కులగణన జరిగి తీరుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరి ఎవరు ఆపలేరు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం కులగణన అంశంపై దేశానికి దిశా దశగా నిలుస్తోందని తెలిపారు. కులగణనపై క్యాబినెట్, అసెంబ్లీలో తీర్మానం చేసి ప్లానింగ్ శాఖ ద్వారా కులగణన విజయవంతంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికీ 50 శాతానికి పైగా సర్వే పూర్తయిందన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలుస్తోందని, రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూటమి కులగణన చేపడుతోందని వ్యాఖ్యానించారు. జనాభా నిష్పత్తి ప్రకారం... రిజర్వేషన్లు సంక్షేమ ఫలాలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.