న్యూఢిల్లీ,(విజయక్రాంతి): మహారాష్ట్ర, ఝార్ఖండ్ కు ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రా ఎన్నికల ప్రధాని కమిషనర్ రాజీవ్ కుమార్ పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్, హరియాణా ఎన్నికలు విజయవంతంగా నిర్వహించామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగియనుంది. మహారాష్ట్రలో 36 జిల్లాల్లో 288 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 234 జనరల్ సీట్లు కాగా.. 25 ఎస్టీ, 29 ఎస్పీ స్థానాలు ఉన్నాయి. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4.66 కోట్ల మహిళ ఓటర్లు, 4.97 కోట్ల పరుష ఓటర్లు, 1.85 కోట్ల యువ ఓటర్లు, 20.93 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అక్కడ 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని ఈసీ వెల్లడించింది.
మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్
అక్టోబర్ 22న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 29 వరకు నామినేషన్ల స్వీకరణ
నవంబర్ 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 20న పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు
ఝార్ఖండ్ లో 24 జిల్లాల్లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో 44 జనరల్ సీట్లు కాగా.. ఎస్సీ 9, ఎస్టీ 28 చొప్పున ఉన్నాయి. మొత్తం 2.6 కోట్లు ఓటర్లు ఉన్నారు. వీరిలో 1.29 కోట్ల మంది మహిళ ఓటర్లు, 1.31 కోట్లు పరుష ఓటర్లు, 11.84 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.
ఝార్ఖండ్ ఎన్నికల షెడ్యూల్
అక్టోబర్ 18న మొదటి దశ, అక్టోబర్ 22న రెండో దశ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
అక్టోబర్ 25 వరకు మొదటి దశ, అక్టోబర్ 29 వరకు రెండో దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
అక్టోబర్ 30 వరకు మొదటి దశ, నవంబర్ 1 వరకు రెండో దశ నామినేషన్ల ఉపసంహరణకు గడువు
నవంబర్ 13న మొదటి దశ, నవంబర్ 20న రెండో దశ పోలింగ్
నవంబర్ 23న ఓట్ల లెక్కింపు