calender_icon.png 1 October, 2024 | 12:50 PM

మహారాణి రుక్మిణీదేవి!

30-09-2024 12:28:38 AM

అందం, ప్రతిభ గల అతి తక్కువ మంది తెలుగు హీరోయిన్లలో ఒకరు రీతు వర్మ. ‘పెళ్లిచూపులు, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘కనులు కనులను దోచాయంటే’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. అటు ఫిల్మ్ మేకర్స్ వద్ద మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో పలు క్రేజీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉందీ ముద్దుగుమ్మ.

ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘శ్వాగ్’ ఒకటి. ఈ సినిమాలో రీతు వర్మ వింజామర వంశ మహారాణి పాత్రలో కనిపించనుంది. ఛాలెంజింగ్ పాత్రలు చేసేందుకు ఇష్టపడే రీతు వర్మ.. మహారాణి రుక్మిణీదేవి పాత్ర కోసం ప్రత్యేకంగా సన్నద్ధమైంది. శ్రీవిష్ణు హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో దర్శకుడు హసిత్ గోలి రూపొందించిన ‘శ్వాగ్’ మూవీ అక్టోబర్ 4న విడుదల కానుంది.