తెలంగాణ భవన్‌లో రేపటి నుంచి ఉత్సవాలు షురూ
- మూడు రోజుల పాటు నిర్వహణ
- హాజరుకానున్న కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు, ఎంపీలు
చార్మినార్, జూలై 6 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమం ప్రజలకు ఎన్నో కొత్త పాఠం నేర్పింది. కళాకారులు ప్రజలను చైతన్యపరిచేందుకు మన సంస్కృతిలో భాగమైన కళారూపాలను ఎంచుకుని ఎలుగెత్తి చాటారు. బోనాలు, బతుకమ్మ పండుగలను సైతం ఉద్యమంలో భాగం చేశారు. ఇదే కోవ లో ఉద్యమకారులు, నగరవాసులు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో లాల్‌దర్వాజ బోనా లు నిర్వహించారు.
తెలంగాణ వస్తే ఢిల్లీ నడిబొడ్డునా బోనాల పండుగ నిర్వహిస్తామని ప్రతినబూని.. స్వరాష్ట్రం రాగానే ఢిల్లీలోని తెలంగాణ భవనంలో మహంకాళి అమ్మవా రి ప్రతిమ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఏటా ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు. పదేండ్ల క్రితం 45 మందితో మొదలైన బోనాల పండుగ, ఇప్పుడు 300 మంది పాల్గొనే వరకూ వచ్చింది. ఇప్పటివరకు రాజకీయ దురంధరులైన వెంకయ్యనాయుడు, బండారు దత్తా త్రేయ, కిషన్‌రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు
ఈసారి ఉత్సవాలు ఇలా..
బోనాల వేడుకలకు లాల్‌దర్వాజ సింహ వాహిని మహంకాళి ఆలయ చైర్మన్ ఏ మాణిక్ ప్రభుగౌడ్, ముఖ్య సలహాదారుడు జీ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో 45 మంది సభ్యుల బృందం, సాంస్కృతిక ప్రదర్శనలకు మరో 25 మంది కళాకారులు దేశఢిల్లీ చేరుకోనున్నారు. తెలంగాణ భవన్ ఇన్‌చార్జి రామ్మోన్‌రావు సహకారంతో సోమవారం ఫొటోఎగ్జిబిషన్‌తో ఉత్సవాలు ప్రారంభంకాను న్నాయి. నిర్వాహకులు మంగళవారం ఇండియా గేట్ నుంచి మేళతాళాల నడుమ మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి తెలంగాణ భవన్‌లో ప్రతి ష్ఠ చేస్తారు. 10న అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున పలువురు కేంద్ర మంత్రులు, సహాయ మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. ఇదే రోజు సాయంత్రం డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ముగింపు వేడుకలు నిర్వహిస్తారు.