calender_icon.png 1 February, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాలక్ష్మి కటాక్షం చూపాలి

01-02-2025 12:24:41 AM

  1. బడ్జెట్‌కు ముందు మీడియాతో మోదీ 
  2. పన్ను జీవులకు ఊరట లభించేనా?
  3. నిర్మలమ్మ పద్దులో ఏముందో?
  4. కోటి ఆశలతో మధ్య తరగతి జీవుడు
  5. పదేండ్లలో విదేశీజోక్యం లేని బడ్జెట్ ఇదేనన్న ప్రధాని

న్యూఢిల్లీ, జనవరి 31: నేడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ఏ వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తుందనే చర్చలు జరుగుతున్న వేళ.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీడియాతో ప్రధాని మోదీ మాట్లాడుతూ..

పేద, మధ్యతరగతి వారిపై మహాలక్ష్మి కటాక్షం చూపాలని అన్నారు. దీంతో బడ్జెట్ మీద మధ్య తరగతి, పేద ప్రజలు మరిన్ని ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. పన్ను జీవులకు కూడా ఊరట లభిస్తుందా.. అని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. 

మహాలక్ష్మిని అదే ప్రార్థిస్తున్నా: ప్రధాని

పేదలు, మధ్య తరగతి వారిపై మహాలక్ష్మి కటాక్షం చూపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘పేద, మధ్య తరగతి ప్రజలపై ఆశీస్సులు కురిపించాలని లక్ష్మీదేవతను ప్రార్థిస్తా. భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించి 75 ఏళ్లు కావడం మనందరికీ గర్వకారణం. ప్రపంచ వ్యాప్తంగా భారత్ గొప్ప శక్తిగా ఎదుగుతోంది.

మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇది తొలి సంపూర్ణ బడ్జెట్. భారత్ స్వాతంత్య్రం పొంది 100 ఏండ్లు పూర్తయ్యే సరికి వికసిత్ భారత్ లక్ష్యం నెరవేతుందని నేను బలంగా విశ్వసిస్తున్నా. మూడో టర్మ్‌లో ప్రవేశపెట్టబోయే ఈ బడ్జెట్ అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడేలా రూపకల్పన చేశాం. ఈ బడ్జెట్ దేశ ప్రజలకు కొత్త శక్తి ని ఇస్తుంది.

మేము మిషన్ మోడ్‌లో కొనసాగుతున్నాం. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌క్లూజన్ లక్ష్యంతో బడ్జెట్ ఉండనుంది. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు కూడా ప్రవేశపెడతాం. ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని అనుకుంటున్నా’ అని ప్రధాని పేర్కొన్నారు. 

సామాన్యునికి ఊరట దక్కేనా? 

బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఒక రోజు ముందు ప్రధాని మధ్య తరగతి ప్రజలపై లక్ష్మీ కటాక్షం అని అనడంతో ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ఉంటారని అంతా భావిస్తున్నారు. మధ్య తరగతి ప్రజలకు పన్ను మినహాయింపులు ఉంటాయి కావొచ్చని ఆశలు పెట్టుకున్నారు. వేతన జీవులు తమకు పన్ను మినహాయింపులు ఏమైనా ఉంటాయా అని ప్రతి సంవత్సరం బడ్జెట్‌ను ఆశగా తిలకిస్తారు. కానీ వారికి మాత్రం ప్రతిసారి నిరాశే ఎదురువుతోంది. 

విదేశీ జోక్యం లేని బడ్జెట్

‘గడిచిన 10 ఏండ్ల నుంచి బడ్జెట్ కు ముందు ఏదో ఒక ఘటన ద్వారా విదేశీయులు జోక్యం చేసుకుంటూనే ఉన్నారు. వారికి భారత్‌లోని పలు పా ర్టీలు సహకారం అందిస్తున్నాయి. కానీ ఈ సారి మాత్రం ఎటువంటి విదేశీజో క్యం లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నాం’. అని మోదీ తెలిపారు.