calender_icon.png 11 October, 2024 | 2:49 PM

బెంగాల్ నేపథ్యంలో మహాకాళి

11-10-2024 12:00:00 AM

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ) నుంచి వచ్చిన తొలిచిత్రం ‘హను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా, ఆ యువ దర్శకుడి యూనివర్స్ నుంచి రూపొందుతున్న 3వ ప్రాజెక్టును మేకర్స్ గురువారం ప్రకటించారు. ఆర్‌కేడీ స్టూడియోస్ పతాకంపై రివాజ్ రమేశ్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బెంగాల్ సాంస్కృతిక నేపథ్యం ఉన్న ‘మహాకాళి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ప్రశాంత్ వర్మ కథ, స్క్రీన్ ప్లే అందిస్తుండగా మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్యాత్మిక, పౌరాణిక అంశాలతో ఈ సినిమా ఉండబోతోంది. ఇది భారతదేశం నుంచి వస్తున్న ఫస్ట్ ఫిమేల్ సూపర్ హీరో, యూనివర్స్‌లో మోస్ట్ ఫెరోషియస్ సూపర్ హీరో మూవీగా నిలువనుంది.

పక్షపాతం లేని ప్రాతినిధ్యం వైపు ఉద్యమం ‘మహాకాళి’ అని చిత్రబృందం పేర్కొంది. భారతీయ మహిళల వైవిధ్యాన్ని, వారి అచంచలమైన స్ఫూర్తిని ప్రదర్శించనుందీ సినిమా. ఇండియన్, ఫారిన్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ తర్వాత తెలియజేయనున్నారు.