27-03-2025 10:43:21 PM
పెద్ద కొడఫ్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో గురువారం అధ్యక్షులు హన్మంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ కార్యదర్శి సందీప్ కుమార్ అందించిన వివరాల మేరకు ఆదాయ వ్యాయాలను అర్ధవార్షిక జమ ఖర్చు నివేదికను సభాముఖంగా చదివి సంఘం సభ్యులకు వినిపించారు. తదనంతరం కీలక నిర్ణయాల్లో భాగంగా తొందరగా జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఎకరానికి 9, క్వింటాళ్ల నుండి సుమారు 25 క్వింటాళ్ల వరకు పెంచి కొనుగోలు చేయాలని మహాజన సంఘ సభ్యులు తీర్మానించి ఆమోదించారు. రుణమాఫీ కానీ రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హనుమంత్ రెడ్డి, డైరెక్టర్ నాగిరెడ్డి, సెక్రటరీ సందీప్ కుమార్, డైరెక్టర్లు హనుమయ్య, సాయవ్వ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓటీఎస్ సద్వినియోగం చేసుకోవాలని సెక్రటరీ సూచించారు.