calender_icon.png 30 March, 2025 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిమ్మానగర్ ప్రాథమిక సహకార సంఘంలో మహాజన సభ

26-03-2025 07:41:25 PM

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని తిమ్మానగర్ ప్రాథమిక సహకార సంఘంలో ఛైర్మన్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో మహాజన సభ నిర్వహించారు. సొసైటీ కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ అందించిన వివరాల మేరకు ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు. కీలక నిర్ణయాల్లో భాగంగా, ప్రతి ఎకరానికి 25 క్వింటాళ్ల జొన్నల కొనుగోలు, గత వర్షాకాలంలో బోనస్ అందుకోని సన్నాలపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సమావేశంలో సొసైటీ వైస్ ఛైర్మన్ సాయిలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.