calender_icon.png 10 January, 2025 | 2:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25న మూసీ బాధితులతో మహాధర్నా

22-10-2024 02:49:05 AM

  1. 23, 24 తేదీల్లో మూసీ ప్రాంతాల్లో పార్టీ బృందాల పర్యటన
  2. బీజేపీ నాయకులు

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): మూసీ బాధితులతో కలిసి ఈనెల 25న కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఇందిరాపార్కువద్ద మహాధ ర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు బీజేపీ నేత లు వెల్లడించారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం వారు మాట్లాడుతూ అక్టోబరు 23, 24వ తేదీల్లో రాష్ర్టంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి నాయకులతో కూడిన 9 టీమ్‌లతో 18 ప్రాంతాలను సందర్శించి, మూసీ బాధితులకు అండగా నిలిచే లా కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. మూసీ విధ్వంసకాండను చూస్తూ బీజేపీ ఊరుకోబోదని, దీనిపై పోరాటం చేస్తామని తెలిపారు.

బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మేనిఫెస్టో చెప్పినవి కాకుండా కొత్తగా సెన్సేషనల్ విషయాలను తెరపైకి తెస్తోందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు చేసి దివాళా తీయించితే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ టూర్లతో దుబారా ఖర్చు చేస్తోందని విమర్శించారు. 

ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టును చేపట్టే ముందు స్టడీ టూర్ చేసి, ఆ తర్వాత పనులకు శ్రీకారం చుడుతుందని, స్టడీ టూర్ చేసిన తర్వాతే మూసీ ప్రాజెక్టు గురించి మాట్లాడితే బాగుండేదన్నారు. డీపీఆర్ రూపొందించే బాధ్యతను పాకిస్తాన్‌కు చెంది న కన్సల్టెన్సీకి ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. డీపీఆర్ లేకుండా ప్రతి పక్షాలతో ఎలా చర్చిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైమాండ్‌కు కప్పం కట్టేందుకే రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ అంటున్నారని దుయ్యబట్టారు.