calender_icon.png 21 February, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్వాన్ మహిళా కాంగ్రెస్ ఇంచార్జిగా మహాదేవి

19-02-2025 12:28:07 AM

సత్కరించిన నాయకులు

రాజేంద్రనగర్ (కార్వాన్) ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): కార్వాన్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఇన్చార్జిగా మహాదేవిని నియమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఏ బ్లాక్ అధ్యక్షుడు కూరాకుల కృష్ణ ఆధ్వర్యంలో  మంగళవారం కార్వాన్ డివిజన్లోని నేతాజీ నగర్ లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా మహాదేవి, కూరాకుల కృష్ణ మాట్లాడుతూ.. నియోజకవర్గం లో పార్టీ అభివృద్ధి కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు నిత్యం ప్రజల్లో ఉండాలని పేర్కొన్నారు.

కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ వినోద్ సింగ్, నర్సింగ్ గౌడ్, జయగూడ డివిజన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గజ్రే కిషన్, రాంకుమార్, హమీద్, శ్రీకాంత్, గోపాల్, అల్లి ప్రేమ్, కిషోర్, హబీబ్, శివలాల్, మహిళా కాంగ్రెస్ బి బ్లాక్ అధ్యక్షురాలు షకీలా తదితరులు పాల్గొన్నారు.