calender_icon.png 28 November, 2024 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడుపులో విషం నింపుకొని పాలన చేసిండ్రు

28-11-2024 03:50:43 PM

దేశం తెలంగాణ వైపు చూస్తుంది  

రైతు పండుగ ప్రారంభోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్, (విజయ క్రాంతి): కడుపులో విషం పెట్టుకొని గత పాలకులు పాలన కొనసాగించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం భూత్ పూర్  మండలం అమిస్తాపూర్ లో రైతు పండుగ వేదిక దగ్గర జరిగిన రైతు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులను గత ప్రభుత్వం నిలువునా ముంచిందని,  కడుపులో విషయాన్ని నింపుకొని మనసులో  ద్వేషం పెంచుకొని, ప్రజలను తప్పు దోవ పట్టించే విధంగా కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు. 

మంచి మనసున్న రేవంత్ రెడ్డి ఆలోచన  మంచి సంకల్పం చేత ప్రజాపాలనలో ప్రకృతి సైతం సహకరించి మంచి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు పూర్తిగా నిండడం తో రైతులు మంచిగా పంటలు పండించారని, వారికి ఈ సంవత్సరం వ్యవసాయం అధిక రాబడి తెచ్చిపెట్టాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కూడా ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇచ్చిన మాట ప్రకారం రూ.18 వేల కోట్లతో రైతులకు  రుణమాఫీ చేసి 22 లక్షల మందిని రుణ విముక్తి చేసిన ఘనత మా రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రజా ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రభుత్వ సంకల్పాన్ని అర్థం చేసుకొని రైతులు సన్న వడ్లను పండించారని వవడ్ల ను  కొనేందుకు 7,500 లకు పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మంచి మద్దతు ధరను సన్న వడ్లకు ఇస్తున్నామంటే అది దైవ కృప అని,  దైవం కూడా మాకు  సహకరిస్తున్నారు. 

పూర్వం స్వార్థం కలిగిన  కొంతమంది రాజులు ఉండేవారని, వారు తమ సొంత అభివృద్ధి మాత్రమే కాంక్షించేవారని, ఇతరులు అభివృద్ధి చెందితే ఏ మాత్రం సహించే వారు కాదని, అదే  స్పూర్తితో  కేసిఆర్ గారు వారి  బంధువర్గం 500 ఎకరాల తన వ్యవసాయ క్షేత్రంతో ఏ టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయం చేసుకుంటూ మంచి రాబడి పొందుతున్నారని,  ఏ దేశం నుంచి ఏ టెక్నాలజీ తెచ్చుకున్నాడో తెలియదు కానీ  తాను మాత్రం మంచి  లాభాలను పొంది ప్రజలకు మాత్రం ఆ యొక్క టెక్నాలజీని ఏనాడూ అందించలేదని ఆయన ఆరోపించారు. కానీ మాది ప్రజా ప్రభుత్వం, రైతుల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రైతులకు అన్ని విధాల సహకరించేందుకు వారి యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే బాధ్యత మా పైన ఉంది కాబట్టి,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రకాలైన సాగు పద్ధతుల పైన, మిషనరీ లను ఇక్కడ  ప్రదర్శించి, వాటిపైన రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇచ్చి రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్దతులను పరిచయం చేస్తున్నామని,  వారు పండించే పంటకు మంచి రాబడి  తెచ్చేందుకు మేము ఈ మహాతర కార్యక్రమానికి  శ్రీకారం చుట్టామని ఆయన చెప్పారు. 

ఇటువంటి రైతు పండుగలు, ఆవిష్కరణలు, ప్రతి జిల్లా లో నిర్వహిస్తే బాగుంటుందని ఆయన మంత్రులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ,  ఎక్సైజ్ శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జియంఆర్, నారాయణ పేట ఎమ్మెల్యే డాక్టర్ పర్నికా రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ,  జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి, వ్యవసాయ చైర్మన్ కోదండ రెడ్డి,  మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, టి పిసిసి ప్రదాన కార్యదర్శి వినోద్ కుమార్, పద్మశ్రీ వెంకటరెడ్డి, రైతులు , అధికారులు  పాల్గొన్నారు.