మహబూబ్నగర్: పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. గురువారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నందు చాకలి ఐలమ్మ జయంతిని పూర్చరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి జిల్లా ఎస్పీ డి జానకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ ఉత్పకారిణి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్రా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 26న జరుపుకు చాకలి ఐలమ్మ తెలంగాణా ప్రాంతంలో జాతిపరమైన విముక్తి పోరాటంలో ప్రముఖంగా నిలిచిన మహిళా నాయకురాలని, ఆమె తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటంలో, జమీందారీ వ్యవస్థ, నిర్బంధ విధానాలకు వ్యతిరేకంగా పోరాడి, సామాజిక న్యాయం కోసం ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. ఆమె జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటూ, ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించు కోవడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణా రాష్ట్రంలో, మహిళా సాధికారత, సామాజిక న్యాయం కోసం ఆమె అందించిన కృషిని గుర్తుచేసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు, అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీలు రమణా రెడ్డి, శ్రీనివాసులు, సుదర్శన్, ఇన్స్పెక్టర్ శివ కుమార్, కృష్ణయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.