13-04-2025 01:12:59 PM
మహబూబాబాద్, (విజయక్రాంతి): గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రక్షాళన, గుజరాత్ జిల్లాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 43 మంది ఏఐసీసీ పరిశీలకులను, 183 మంది పీసీసీ పరిశీలకులను నియమిస్తూ శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ జాబితా ప్రకటన విడుదల చేశారు. ఇందులో తెలంగాణ నుంచి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్ ఉన్నారు. మొడాసా పట్టణంలో ఈనెల 15న మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ, పీసీసీ పరిశీలకుల తొలి భేటీ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ నుంచే పార్టీ ప్రక్షాళనను షురూ చేసింది. గుజరాత్ లో రెండు రోజుల పార్టీ సమావేశం జరిగిన కొద్ది రోజుల్లోనే దూకుడు పెంచింది.