calender_icon.png 26 February, 2025 | 6:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేతకి ఆలయంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

26-02-2025 01:37:27 PM

భారీగా తరలివస్తున్న మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన భక్తులు

సంగారెడ్డి,(విజయక్రాంతి): మహాశివరాత్రి వేడుకలు కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లాలో ఉన్న కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం(Sri Ketaki Sangameshwara Swamy Temple)లో మహాశివరాత్రి వేడుకలు(Maha Shivarathri Celebrations) వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అమృత గుండంలో స్నానాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడంతో క్యూ లైన్ లో ఉండి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు(Zaheerabad MLA Manik Rao) కేతగి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ కేతకి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో వారికి స్వాగతం పలికారు. జహీరాబాద్ డిఎస్పి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు. జహీరాబాద్ ఆర్డిఓ రాంరెడ్డి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.