calender_icon.png 12 February, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14, 15వ తేదీల్లో మహా నగరోత్సవం

12-02-2025 01:29:33 AM

  • గ్రామపంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేయండి 
  • అధికారులతో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : ఈనెల 14 15 తేదీల్లో మహబూబ్ నగర్ మహానగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం  జిల్లా కేంద్రంలోని శిల్పారామంను పరిశీలించారు. అంతకుముందు అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రత్యేకంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహానగరోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో ఉదయం 10:30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వేడుకలు నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి కష్టాలు తో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.  గ్రామాపంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్టేజి 1,2,3 నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి ఈ నెల 15 లోపు శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.