calender_icon.png 27 February, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మహాకుంభమేళా

27-02-2025 01:00:26 AM

45 రోజుల పాటు కొనసాగిన పుణ్యస్నానాలు

మహాశివరాత్రి రోజు పుణ్యస్నానమాచరించిన కోటిన్నర మంది

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 26: నెలన్నరగా భక్తులను ఆధ్యాత్మిక సంద్రంలో ముంచిన మహాకుంభమేళా బుధవారంతో ముగిసిం ది. మహాశివరాత్రి సందర్భంగా చివరి అమృ త స్నానం జరగ్గా.. 1.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ముఖ్య మంత్రులు, సెలబ్రెటీలు త్రివేణీ సంగమం లో పుణ్యస్నానం ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మేళా కావడంతో దేశవిదేశాల నుంచి భ క్తులు పెద్ద ఎత్తున పాల్గొని.. పుణ్యస్నానాలు ఆచరించారు.

దేశవిదేశాల్లోని హిందువుల ఐక్యతకు ఈ మేళా అద్దం పట్టింది. హిందూ ధర్మం ఎంత గొప్పదో, ప్రపంచంలో హిందూ ధర్మానికి ఎంత గొప్ప స్థానం ఉందో కూడా ఈ మేళా ద్వారా రుజువైంది. బుధవారం సాయంత్రం వరకే సుమారు 64.77 కోట్ల మంది పుణ్యస్నానం చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. కేవలం చైనా, భారత్ జనాభా మాత్రమే ఈ సంఖ్య కంటే ఎక్కువ. చివరి అమృత స్నానం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

చివరి రోజును పురస్కరించుకుని ఐఏఎఫ్ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) ఎయిర్ షో నిర్వహించింది. ఈ ఎయిర్ షో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహాకుంభమేళా వల్ల ఎంతో మంది రాత్రికి రాత్రే స్టార్లుగా ఆవిర్భవించారు. కుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసా, ఐఐటీ బాబా ఇలా అనేక మందిని స్టార్లుగా మార్చింది. అంతే కాకుండా ఈ మేళా కొంత మందికి నిద్ర లేని రాత్రులనూ మిగిల్చింది. మౌని అమావాస్య రోజు తొక్కిసలాటలో 30 మంది చనియారు.