రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసా గుతున్నాయి. వేడుకల్లో భాగంగా శనివారం ఉదయం అర్చకులు మహా గణపతి మూలమంత్ర హవనం, సాయంత్రం గర్భాలయంలోని లక్ష్మీగణపతికి మహాపూజ నిర్వహించారు. ఆదివారం సాయంత్రం పెద్దసేవ ఉరేగింపు అనంతరం వినాయక నిమ జ్జనం చేపట్టనున్నారు.