calender_icon.png 11 January, 2025 | 3:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరాపార్కు వద్ద మహ ధర్నా.. రోడ్డెక్కిన ఆటోవాలాలు

05-11-2024 01:46:46 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై రోజురోజుకు నిరసనలు, ఆందోళనలు పెరిగిపోతున్నాయి. మంగళవారం హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు రోడ్డు ఎక్కారు.  ఇందిరాపార్కు వద్ద ఆటో యూనియన్లు మహ ధర్నా చేపట్టారు. తక్షణమే మీటర్ ఛార్జ్ లు పెంచాలని ఆటో యూనియన్లు కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేశాయి. అధే విధంగా ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోవాలాలకు కాంగ్రెస్ ఇచ్చిన హమీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆటోవాలాలకు ప్రభుత్వం ఇస్తానన్న రూ.12 వేల ఆర్ధిక చేయూత అందించాలని డిమాండ్ చేశారు.