ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ చంద్రశేఖర్
కామారెడ్డి అర్బన్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): ప్రజాసంఘాల ఐక్యవేదిక (సీఐటీయూ.రైతు సంఘము.వ్యకస )ఆధ్వర్యంలో ఫిబ్రవరి 10 తేదీన ఇంద్ర పార్క్ లో మహా ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం సిఐటియు కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్లో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని అన్నారు. కేంద్ర బడ్జెట్ సవరించి మార్చిలో పెట్టబోతున్న తెలంగాణ బడ్జెట్ కార్మికులకు, రైతులకు, ప్రజలకు, మున్సిపల్, గ్రామపంచాయతీ, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనంకార్మికులు, ఐకేపీ. అసంఘటిక కార్మికుల కు మేలు జరిగేలా బడ్జెట్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇట్టి మహా ధర్నాకు అన్ని రకాల కార్మికులు ఇంద్రపార్క్ కు తరలి రావాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాల పైన అఖిలపక్షంతో ఢిల్లీలో ధర్నాలు ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చు కానీ ఇవేమీ చేయకుండా తెలంగాణ నుండి బిజెపికి ఇద్దరు కేంద్ర మంత్రులు 8 మంది లోక్ సభ సభ్యులు ఉన్న రాష్ట్రం పట్ల బాధ్యతరహితంగా వ్యవహరిస్తున్నారు.
కాబట్టి కేంద్ర బిజెపి సర్కార్ను బోనులో నిలబెట్టి ప్రజ క్షేత్రంలో ఎండబెట్టడం ద్వారానే రాష్ట్రానికి నిధులు రాబట్టడం సాధ్యమవుతుంది అందుకు రాష్ట్రంలో అందరినీ కలుపు కూని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కూడా సంక్షేమ పథకాలను తగిన విధంగా కేటాయింపులు.
కేంద్ర ప్రభుత్వం ఉన్న ప్రవేశపెట్టిన కార్మి కార్మిక కర్షక ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నది కావున రేపు జరగబోయే నిరసనలో రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం అన్ని ప్రజా సంఘాలు తరలిరావాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక డిమాండ్ చేస్తుందన్నారు.
రైతు సంఘం జిల్లా కార్యదర్శి మోతి రామ్, జిల్లా కార్యదర్శి కొత్త నరసింహులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేణుక, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కే రాజనర్సు, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యకులు ముదాం అరుణ్ పాల్గొన్నారు.