- చిగురుటాకులా వణికిన ముంబై, పుణె నగరాలు
- బుధవారం రాత్రి ఒక్కరోజే 20 సెం.మీ. వర్షపాతం
- వరదల ధాటికి ఆరుగురు మృతి
- విమానయాన సేవలపై ప్రభావం
ముంబై, జూలై 25: భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి. బుధ వారం రాత్రి కురిసిన భారీ వర్షం రాష్ట్రాన్ని కుదేలు చేసింది. ఒక్క రాత్రిలోనే దాదాపు 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. ముం బై, పుణె నగరాలు జలమయమ య్యాయి. చాలా ప్రాంతాల్లో మోకాళ్ల లోతు నీరు చేరింది. పుణెలో భారీ వర్షాల కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు డెక్కన్ జింఖాన వద్ద విద్యుదాఘాతం వల్ల మరణించారు. ముంబైలోని ప లు ప్రాంతాల్లో వరద ఉద్ధృతి తీవ్రంగా ఉంది. నగరానికి నీటిని అందించే ఏడు సరస్సులు ఉప్పొంగుతున్నాయి. ఇప్పటికే ముం బై, పుణెలో రెడ్ అలర్ట్ జారీ చేశారు.
విమాన సర్వీలపై ప్రభావం
ముంబై, పుణెలో భారీ వర్షాలు, వరదల కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం ఏర్పడింది. విమానయాన సంస్థలు ప్రయాణీకులకు మందస్తు హెచ్చరికలు జారీ చేశా యి. టైంటేబుల్ల్ జాప్యం జరుగుతోందని, బయలుదేరే ముందు ఫ్లుటై స్టేటస్ చెక్ చేసుకోవాలని ఎయిర్‌లైన్స్ సంస్థలు సూచించా యి. ముంబైలో కొన్ని విమాన సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపాయి. ఎన్డీఆర్‌ఎప్, ఎస్డీఆర్‌ఎఫ్ అప్రమత్తంగా ఉండాలని మహా రాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఆదేశించారు.