calender_icon.png 17 April, 2025 | 4:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుగ్గ దేవాలయంలో మహా అన్నదానం

06-04-2025 10:20:04 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా భక్తులకు అన్నదాత అప్పాల చంద్రశేఖర్, లక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకలకు కాసిపేట, తాండూర్, బెల్లంపల్లి మండలాల నుండి 5 వేల మంది భక్తులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తులకు చల్లని త్రాగునీరు అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నాతరి స్వామి, బుగ్గ రాజేశ్వర స్వామి అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి, సభ్యులు మాసాడి శ్రీరాములు, మిట్ట చంద్రయ్య, సుంకరి రాజేశం, మురుకూరి బాలకృష్ణ, జిల్లపెల్లి స్వరూప తదితరులు పాల్గొన్నారు.