calender_icon.png 1 April, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయ్యారాల హొయలు!

31-03-2025 01:16:36 AM

టీహబ్‌లో ‘మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్’ గ్రాండ్ ఫినాలే

హాజరైన యువతులు, వివాహితలు

ఫ్యాషన్ షోలో అలరించిన మగువలు

ప్రత్యేక ఆకర్షణగా సినీనటి వితికా షెరు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాం తి): మిస్ అండ్ మిసెస్ స్ట్రాంగ్ బ్యూటిఫుల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ ఫినాలే ఆకట్టుకుంది. యువతులతో పాటు వివాహి తలు వయ్యారాల ఒలకబోతలతో కనువిం దు చేశారు. హైదరాబాద్‌లోని టీహబ్‌లో ఆదివారం ఉగాది సందర్భంగా నిర్వహించిన ఈ ఫినాలేలో వైద్యులు, ఐటీ ఉద్యోగులు, ఫ్యాషన్ డిజైనర్లు, ఔత్సాహిక  మోడళ్లు, గృహిణులతో పాటు విభిన్న రంగాలకు చెం దిన  50 మంది అతివలు తమ హోయలతో అలరించారు. టాలీవుడ్ నటి వితికా షెరు, నిర్వాహకులు కిరణ్మయి అలివేలు ఫినాలేను మొదట జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కతక్ నృత్యకారిణి సంధ్య, హ్యాండ్‌లూమ్ క్యూరెటర్  శ్రీదేవి విజయదా స్, మిస్ గెలాక్సీ ఇండియా జాష్ణవి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.