పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్(Palghar) జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3.7 తీవ్రతతో భూకంపం(Earthquake) సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదిక అందలేదని వారు తెలిపారు. దహను తాలూకాలో తెల్లవారుజామున 4:35 గంటలకు సంభవించిన ఈ ప్రకంపనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ సెల్ చీఫ్ వివేకానంద్ కదమ్ తెలిపారు. తాలూకాలోని బోర్డి, డాప్‌చారి, తలసరి ప్రాంతాలలో ప్రజలు తెల్లవారుజామున ప్రకంపనలు అనుభవించినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గతంలోనూ అప్పుడప్పుడు ప్రకంపనలు వచ్చాయి.