పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు
ప్రజలపై మల్లన్న ఆశీస్సులు ఉండాలని ఆకాంక్ష...
పటాన్‌చెరు: పటాన్‌చెరు మండలం పోచారం గ్రామంలో జరుగుతున్న బండల మల్లన్న జాతర సోమవారం వైభవంగా జరిగింది. పోచారం గ్రామస్తులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా హాజరయ్యారు. జాతరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ పార్లమెంట్ కంటెస్టెంట్ క్యాండిడెట్ నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి మల్లన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మల్లన దయతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జాతరలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింభింపజేస్తాయన్నారు. గ్రామాలన్ని ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళతాయన్నారు. ప్రజల్లో ఐక్యమత్యం వెల్లివిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, కిష్టయ్య, నాగభూషణం, మల్లేశ్, సత్తయ్య, దేవరాజ్, రవి, భద్రయ్య, నవీన్, మధు, ప్రవీన్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.