వానకాలం వచ్చిదంటే జుట్టు రాలే సమస్య మరింత పెరుగుతుంది. సీజన్‌లో తేమతో కూడిన వాతావరణంలో వివిధ రకాల ఇన్‌ఫెక్షన్‌లు తలలో తిష్టవేస్తాయి. చుండ్రు కూడా మరింత పెరుగుతుంది. అందుకే వానకాలం రాగానే జుట్టు రాలడం మొదలవుతుంది. కానీ సకాలంలో జాగ్రత్తలు తీసుకోకుంటే వెంట్రుకలు విపరీతంగా రాలిపోతాయి.
నల్లని ఒత్తున జుట్టు పొందడానికి చాలా మంది క్రమం తప్పకుండా జుట్టుకు నూనె రాస్తుంటారు. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనె.. వంటి పలు రకాల నూనెలు రాస్తుంటారు. జుట్టు కుదుళ్లు బలంగా ఉండాలంటే దాంట్లో కొన్ని పదార్థాలను కలిపితే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం..
స్టేప్-1
ఈ ప్రత్యేకమైన నూనెను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇందులో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు, యాంటీ ఆక్సింట్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. కొత్త జుట్టు కూడా పెరుగుతుంది. ఈ నూనెను తయారు చేయడానికి రెండు చెంచాల కొబ్బరి నూనెలో గుమ్మడి గింజల నూనె, ఒక చెంచా విటమిన్ ‘ఇ’ నూనె, ఒక చెంచా నల్ల జీలకర్ర నూనె అవసరం. కావాలనుకుంటే రోజ్మేరీ ఎసెన్షియల్ ఆయిల్ ఐదు చుక్కలను జోడించవచ్చు.
స్టేప్-2
గుమ్మడి గింజలు, విటమిన్ ‘ఇ’ ఆయిల్, లిన్సీడ్ ఆయిల్, నల్ల జీలకర్ర నూనెలను ఒక్కొక్కటిగా ఒక గాజు సీసాలో వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఐదు చుక్కల రోజ్మేరీ ఆయిల్ వేయాలి. అన్ని పదార్థాలను మిక్స్ చేసి బాగా కలిపితే మ్యాజిక్ ఆయిల్ రెడీ అయినట్లే.
స్టేప్-3
ఈ నూనె అరచేతిలో తీసుకొని మునివేళ్లతో తలపై సున్నితంగా 5 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా చేస్తే తలలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆక్సిజన్, పోషకాలు జుట్టు కుదుళ్లకు చేరుతాయి. ఫలితంగా జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి.
స్టేప్-4
జుట్టుకు నూనె రాసుకున్న 30 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ నూనెతో వారానికి 1 రోజులు మసాజ్ చేయాలి. నూనెలో జింక్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి. అవిసె గింజల నూనెలో ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ తగ్గించడం ద్వారా స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేంటరీ లక్షణాలతో నిండిన నల్ల జీలకర్ర నూనె చుండ్రును తగ్గిస్తుంది. రోజ్మేరీ ఆయిల్ తలకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ ‘ఇ’ ఆయిల్ జుట్టును మృదువుగా చేస్తుంది.