calender_icon.png 22 December, 2024 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిసెంబర్‌లో మ్యాజిక్

17-10-2024 12:00:00 AM

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘మ్యాజిక్’. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మ్యూజికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో చాలా మంది నూతన నటీనటులు నటిస్తున్నా రు.

బుధవారం అనిరుధ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా మ్యాజిక్‌ను ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ విషయాన్ని వెల్లడి స్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

తమ కాలేజీ ఫెస్ట్ కోసం సొంతంగా ఒక పాటను స్వరపరచడానికి నలుగురు టీనేజర్లు చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. కల నెరవేరాలంటే మొదట ప్రయత్నించాలి. ఆ ప్రయత్నాన్ని అందమైన ప్రయాణంలా చూపించే ‘మ్యాజిక్’ చిత్రమని మేకర్స్ చెబుతున్నారు.