calender_icon.png 13 February, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి, శ్రద్ధలతో మాఘ పూర్ణిమ

13-02-2025 01:03:41 AM

  • పుణ్యస్నానాలకు పోటెత్తిన భక్తులు
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
  • 2 కోట్లు దాటిన పుణ్యస్నానాల సంఖ్య

ప్రయాగ్‌రాజ్, ఫిబ్రవరి 12: మాఘ పూర్ణిమను పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. బుధవారం ఉదయం నుంచే భక్తులు కుంభమేళాకు పోటెత్తగా.. ఎటువంటి అవాంఛనీయ ఘ టనలు చోటు చేసుకోకుండా యూపీ ప్రభు త్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు కుంభమేళా డీఐజీ తెలిపారు. భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురించారు.

ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. బుధవా రం ఆరు గంటల వరకు పుణ్యస్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 46.25 కోట్లు దాటినట్లు యూపీ సమాచార శాఖ వెల్లడించింది. మాఘ తిరుగుపయనమైన ‘కల్పవాసీలు’ 

నెల రోజుల నుంచి కఠిన నియమాలతో దీక్ష చేపట్టిన కల్పవాసీలు మాఘ పూర్ణిమ సందర్భంగా పుణ్యస్నానం ము గించుకుని తిరుగుపయనం అయ్యారు. దాదాపు 10 లక్షల మంది కల్పవాసీలు కుంభమేళాలో ఉన్నారు. కల్పవాసీలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. పూర్ణిమను పురస్కరించుకు ని పుణ్యస్నానమాచరించిన వారిసంఖ్య 2కోట్లు దాటినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.