30-01-2025 12:00:00 AM
పాపన్నపేట, జనవరి 29 : మంజీరా తీరం భక్తజనంతో కిటకిటలాడింది. మాఘ అమావాస్యను పురస్కరించుకుని స్నానమా చరించేందుకు మెడక్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో ఏడుపాయల ప్రాంత పరిసరాలతో పాటు గుడి చుట్టూ ఉన్న నదీపాయలు సైతం నిండిపోయాయి. నదీ స్నానం ఆచరించిన తరువాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
భక్తులు అధిక సంఖ్యలో ఉండ డంతో అమ్మవారి దర్శనానికి రెండు గంట లకు పైగా సమయం పట్టింది. భక్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్ ల ద్వారా నిల్చుని వనదుర్గమ్మను దర్శించుకు ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలు, ఒడిబియ్యం సమర్చించి తమ మొక్కులు తీర్చుకున్నారు.
పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, డప్పు చప్పుల మధ్య బోనాల ఊరేగింపులు తెలం గాణ సంస్కృతికి అద్దం పట్టాయి. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజగోపురం నుండి అమ్మవారి ఆలయం వరకు భక్తులకు ఎండ తగల కుండా ఉండేండుకు గాను పామియానా ఏర్పాటు చేశారు.
అరకొర ఏర్పాట్లతో తప్పని ఇబ్బందులు..
మాఘ అమావాస్యను పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయానికి సుమారు లక్ష మంది వరకు హజరై పుణ్య స్నానాలు ఆచరిస్తారని ముందుగానే తెలిసి నా ఆ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. ఘనపురం ఆనకట్ట వద్ద, ఆలయం వద్ద నుండి ప్రవ హించే నది వద్ద భక్తులు స్నానమాచరిం చేందుకు గాను గతంలో షవర్ బాత్‌లను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం వాటిలో చాలా నిరుపయోగంగా ఉన్నాయి.
అలాగే భక్తులకు అవసరమైన స్థాయిలో మరుగు దొడ్లు, మూత్రశాలలను అందుబాటులోకి తీసుకురాలేదు. దీనివల్ల భక్తులకే కాకుండా ఆలయ విధుల్లో పాల్గోనే ఇతర ఉద్యోగుల కు, ముఖ్యంగా మహిళా ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పుణ్యస్నానా లు ఆచరించి దుస్తులు మార్చుకునేందుకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల మహి ళా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. అమ్మవారి దర్శనం అనంతరం వచ్చే భక్తుల దారిలోనే లడ్డు, పులిహోర విక్రయా లు జరుగుతుండడంతో భక్తుల రద్దీ ఎక్కు వగా ఉండి ఇబ్బందులు పడ్డారు.
అమ్మవారిని దర్శించుకున్న అదనపు కలెక్టర్
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఏడుపాయల వన దుర్గామాత అమ్మవారి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందిం చారు.
అమ్మవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ పర్యవేక్షణలో తగిన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ రాజశేఖర్, పాపన్నపేట ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు.
బోరంచలో ఎమ్మెల్యే దంపతుల పుణ్యస్నానాలు
నారాయణఖేడ్, జనవరి 29 : మాఘ అమావాస్య సందర్భం గా బోరంచలోని మంజీరానదీ తీరం ఒడ్డున ప్రసిద్ధి చెందిన సంగమేశ్వరాలయం వద్ద భక్తులు బుధవారం పెద్దసంఖ్యలో మాఘ అమావాస్య స్నానాలు చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి, దంపతులు మంజీరా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకం, యజ్ఞం కార్యక్రమాలను నిర్వహించారు.
అనంతరం మంజీరా నదికి గంగా హారతి ఇచ్చారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆలయం వద్ద ప్రత్యేక అన్నదానం, పూజా, భజన కార్యక్రమాలు కొనసాగాయి. నారాయణఖేడ్ నియోజక వర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మంజీర నదిలో పుణ్యస్నానాలు చేసి సంగమేశ్వరుని దర్శించుకున్నారు.
నది తీరం వద్ద స్నానాలు చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా స్థానిక గ్రామస్తులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తుల తాకిడి కొనసాగింది.