calender_icon.png 20 April, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదరాసి సెప్టెంబర్‌లో వస్తున్నాడు!

16-04-2025 12:00:00 AM

శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ కాంబోలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’. శ్రీలక్ష్మీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత సారథ్యం వహి స్తుండగా, సినిమాటోగ్రాఫర్‌గా సుదీప్ ఎలామోన్ వ్యవహరిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, అరుణ్ వెంజరమూడు ఆర్ట్ డైరెక్టర్. యాక్షన్ కొరియోగ్రఫీని కెవిన్ మాస్టర్, దిలీప్ మాస్టర్ పర్యవేక్షిస్తున్నారు.