24-03-2025 08:46:10 PM
భద్రాచలం (విజయక్రాంతి): మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ జస్టిస్ వి. శివఘ్నానం సోమవారం శ్రీ భద్రాచల రామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద అర్చకులు దేవాలయం అధికారులు సంప్రదాయంతో స్వాగతం పలకగా, స్వామి వారి మూల విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తయారి అమ్మవారి ఆలయ ఆవరణలో వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం న్యాయమూర్తి శివ నాయక్, భద్రాచలం టౌన్ సిఐ బర్పేట్ రమేష్, దేవస్థానం అధికారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.