calender_icon.png 2 November, 2024 | 4:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశాల్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం

02-08-2024 02:20:49 PM

ప్రముఖ హీరో విశాల్‌పై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ కేసు విచారణలో భాగంగా విశాల్ కోర్టుకు హాజరయ్యారు. వైట్ పేపర్స్ పై తాను సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తనకు తెలియదని జడ్జి ఎదుట విశాల్ వాదించారు. తెలివిగా సమాధానం చెప్పారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు.. సరిగ్గా సమాధానం చెప్పండి అంటూ న్యాయమూర్తి విశాల్ ను ఆదేశించారు. విశాల్, కోలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ మధ్య కొన్నాళ్ల క్రితం డబ్బు విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.