03-03-2025 01:37:40 AM
మద్నూర్, మార్చి 2 (విజయ క్రాంతి), కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయడమే లక్ష్యంగా హైదరాబాదులో జరుగుతున్న యుద్ధ భేరికి కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల ఉపాధ్యా యులు ఆది వారం బయలుదేరారు. సీపీఎస్ అంతమే తమ అంతిమ లక్ష్యమని పీఆర్టీయూ మ ద్నూర్ మండల అధ్యక్షుడు వాగ్మారె భీమ్ అన్నారు. మండల అధ్యక్షుడు లక్ష్మణ్, రాజు, యాదవ్, కమలాకర్, అజిత్ పవార్ తదితరులు పాల్గొన్నారు.