calender_icon.png 22 February, 2025 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న మద్నూర్ ఎస్సై

10-11-2024 04:53:08 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సాయం చేసి మానవత్వం చాటుకున్నాడు కామారెడ్డి జిల్లా మద్నూర్ ఎస్సై కొండ విజయ్. ఆదివారం విధి నిర్వహణలో భాగంగా మద్నూర్ బైపాస్ రోడ్డు వైపు ఎస్సై హోండా విజయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చూసి వారిని గుర్తించిన ఎస్ఐ తన వాహనంలో చికిత్స కోసం గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఎస్సై విజయ్ ని స్థానికులు అభినందించారు.