ఫైనల్లో జెస్సికా పెగులాపై విజయం
సిడ్నీ: అడిలైడ్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఓపెన్ టోర్నీ(Adelaide International Tennis Open Tournament) విజేతగా మాడిసన్ కీస్ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మాడిసన్ కీస్(Madison Keys) (అమెరికా) 6 6 6 టోర్నీలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన జెస్సికా పెగులా(Jessica Pegula) (అమెరికా)ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. పురుషుల సింగిల్స్‌లో సెబాస్టియన్ కోర్డాకు షాకిస్తూ మెక్సికోకు చెందిన అలియసిమ్మే విజేతగా నిలిచాడు. ఫైనల్లో అలియసిమ్మే 6 3 6 కోర్డాను చిత్తు చేశాడు. పురుషుల డబుల్స్‌లో బొలెల్లి మహిళల డబుల్స్‌లో పుట్జ్ జోడీలు విజేతలుగా నిలిచాయి. నేటి నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టోర్నీలో పాల్గొననున్న మాడిసన్ కీస్ విజేతగా నిలిచి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది.