calender_icon.png 19 April, 2025 | 8:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగలకు మంత్రివర్గంలో అవకాశమివ్వాలి

11-04-2025 01:22:31 AM

కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్

హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగలకు అవకాశమివ్వాలని ఎమ్మెల్యే మందుల సామేల్ పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుందని, సీఎం రేవంత్‌రెడ్డి పరిష్కరించారని తెలిపారు. అంబేద్కర్ పొందుపర్చిన ఆర్టికల్ 3 వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణలో మతతత్వ పార్టీలకు మనుగడ  ఉండదని తెలిపారు. దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం రాహుల్‌గాంధీ పోరాడుతున్నారని తెలిపారు.