పీసీసీ చీఫ్‌కు ఆహ్వానం
హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాంతి): డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో నిర్వహించే ‘మాదిగల విజయగర్జన సభ’కు రావాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీలోని మాదిగ నాయకులు ఆహ్వానించారు. శుక్రవారం పీసీసీ చీఫ్‌ను గాంధీభవన్‌లో మాజీ మంత్రి చంద్రశేఖర్, పార్టీ నాయకులు దేవని సతీశ్ మాదిగ, గజ్జెల కాంతం, ఉట్ల వరప్రసాద్, రాములు తదితరులు కలిసి ఆహ్వానపత్రం అందజేశారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. వర్గీకరణను అమలు కోసం మంత్రివర్గ ఉప సంఘం, ఏకసభ్య కమిషన్ కూడా వేసిందని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు ఎవరు అడ్డుపడినా కాంగ్రెస్ ముందుకు సాగాలని పార్టీ నేత సతీశ్ మాదిగ కోరారు. విజయగర్జనకు మంత్రి దామోదర రాజనరసింహతో పాటు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు పాల్గొంటారన్నారు.