calender_icon.png 6 March, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగల మహాడప్పు ప్రదర్శన

06-03-2025 01:05:52 AM

ఖమ్మం, మార్చి 5 ( విజయక్రాంతి ):  మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగల డబ్బు ఆత్మగౌరవ మహాప్రదర్శన ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు బుధవారం చేయటం జరిగింది .

ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు బాకీ శ్రీను మాదిగ మాట్లాడుతూ షమీమ్ అక్తర్ నివేదికలో లోపాలను సవరించాలని , మంత్రివర్గంలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలని, వర్గీకరణ మూడు గ్రూపులుగా కాకుండా నాలుగు ఏ బి సి డి గ్రూపులుగా వర్గీకరించాలని ప్రభుత్వానికి కోరారు.

ఎమ్మార్పీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కూరపాటి సునీల్ మాదిగ, ఎం.ఎస్.పి ఖమ్మం జిల్లా అధ్యక్షులు తురుగంటి అంజయ్య మాదిగ , రాష్ట్ర నాయకులు ఖమ్మం జిల్లా ఇన్చార్జి ఏపూరి వెంకటేశ్వర్లు మాదిగ , రాష్ట్ర నాయకులు ఖమ్మం నియోజకవర్గ ఇన్చార్జి బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ ,

ఎమ్మార్పీఎస్ టౌన్ నాయకులు సుర పెళ్లి నాగేశ్వరరావు మాదిగ , టౌన్ నాయకులు తంబర్ల వెంకట కర్ణ మాదిగ , టౌన్ నాయకులు బండి రవి మాదిగ , డివిజన్ అధ్యక్షులు సూరపల్లి వెంకటరత్నం మాదిగ , డివిజన్ అధ్యక్షులు బలంతు యేసు మాదిగ, జిల్లా , మండల , గ్రామాల నుండి పాల్గొన్నారు .