- అందరికీ సమానత్వం తీసుకురావాలి
- సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణకు అనుకూలం
- మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ల ఫలాలు అందాలని, విద్య, ఉద్యోగాల్లో జనాభా ప్రకారం సమాన అవకాశాలు రావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. కులాలు, ఉపకులాలు అని కాకుండా సమానత్వం సాధించాలన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణ విషయంలో రాష్ట్రాలకే అధికారం ఇచ్చిం ది తప్ప అమలుచేయాలని ఆదేశించలేదని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లను రాష్టా లు వర్గీకరించుకోవచ్చని ఇటీవల సుప్రీం తీర్పు నేపథ్యంలో బుధవారం మాదిగ ఉపకులాల సమావేశం ప్లాజా హోటల్‌లో మంత్రి దామోదర అధ్యక్షతన జరిగింది.
ఇద్దరు ముగ్గురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, ప్రొఫెసర్లతో ఒక కమిటీ వేసుకొని ముం దుకు సాగాలన్నారు. గతంలో జరిగిన వర్గీకరణ ఇప్పుడున్న తెలంగాణకు వర్తిస్తుం దా లేదా అనే అంశంపై ఆలోచించాలన్నా రు. వర్గీకరణకు సంబంధించిన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న వారితో కమిటీ వేసుకొని మేధోమథనం అనంత రం సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందిస్తామన్నారు. అన్ని కులాల సామాజిక, ఆర్థిక, స్థితిగతులను తెలుసుకోవాలన్నారు.
రేవంత్‌రెడ్డి వర్గీకరణ విషయంలో సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. విద్య, ఉద్యోగాల ద్వారా కేవలం 15 శాతం మం దికే అవకాశాలు దక్కుతాయని, మిగతావారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వమే 50 శాతం సబ్సిడీతో రుణా లు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మీనారాయణ, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల శామ్యూల్, వేముల వీరేశం, కాలె యాదయ్యతో పాటు ప్రొఫెసర్ మల్లే శం, మేడి పాపయ్య మాదిగ, కొండ్రు మల్లయ్య, తురుపాటి హన్మంతు, చంద్రమౌళి, రాములమ్మ పాల్గొన్నారు.