13-04-2025 08:23:05 AM
పెద్ద దిక్కు కోల్పోయిన భద్రాచలం మాదిగ ఉద్యోగ సమాఖ్య
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కట్టకూరు నాగభూషణం(Kattakuru Nagabhushanam) ఈ పేరు తెలియని వారు లేరు. భద్రాచలం డివిజన్(Bhadrachalam Division) లో గడిచిన 40 యేండ్ల గా ఐటీడీఏలో ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహించారు, గత సంవత్సరం రిటైర్ అయ్యారు. పాల్వంచలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
వర్గీకరణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు మంధ కృష్ణ పిలుపు అందుకున్న నాగాభాషణం M.E.F లో పలుహోదాల్లో పని చేసి ఉద్యమాన్ని ముందుండి నడిపారు . M.R.P.S కు పెద్ద దిక్కుగా వ్యవహరిoచారు. వర్గీకరణ ఉద్యమంలో బంద్,ర్యాలీలు, చలో హైదరాబాదు వంటి కార్యక్రమాలకి నాయకత్వం వహించారు. త్వరలో వర్గీకరణ జీవో రానున్న సమయంలో అనంత లోకాలకు వెళ్లడం మాదిగ సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరిని కలచి వేస్తోంది. ఆయన మరణాన్ని ఎవరు జీర్ణించుకో లేక పోతున్నారు . ఆయన మృతి పై పలువురు M.E.F M.R.P.S నేతలు సంతాపం వ్యక్తం చేశారు.